కృష్ణా పుష్కరాల సమయంలో

కృష్ణా పుష్కరాల సమయంలో పుణ్యస్నానం ఆచరించడానికి నదిలో దిగినప్పుడు కృష్ణవేణిని, వినాయకుణ్ణి సూర్యభగవానుణ్ణి, బ్రహ్మసరస్వతులను, లక్ష్మీనారాయణులను, పార్వతీపరమేశ్వరులను, పుష్కరుడిని, బృహస్పతిని, ఇంద్రుడ్ని సప్తరుషులను, పంచభూతాలను, మీరు స్నానం చేస్తున్న క్షేత్రదైవాన్ని మీ ఇంటి ఇలవేల్పును, మీ ఇష్టదైవాన్ని తప్పనిసరిగా స్మరించి, అర్థ్యాలను సమర్పించి, కృష్ణానదికి పసుపుకుంకుమలు అర్పించాలి. దీపనీరాజనాలు సమర్పించాలి. సంకల్పపూర్వకంగా పుణ్యస్నానం ఆచరించాలి. కృష్ణా పుష్కరాల సమయంలో పుణ్యస్నానం ఆచరించడం అంటే భక్తిశ్రద్ధలతో సకలపాపాలు తొలగిపోవాలని ప్రార్థిస్తూ మూడు మునకలు వేయడం. భార్యభర్తలైతే వేణీస్నానం చేయాలి. అంటే భార్య కొంగును భర్త కండువాకు కట్టుకుని ఇద్దరూ ఒకేసారి మునకలు వేయాలి. భార్యాభర్తలు ఒకేసారి పుష్కరస్నానాలకు వెళ్లలేకపోయిన పక్షంలో స్త్రీలు మంగళసూత్రంపై పురుషులు హృదయంపై చేయి పెట్టుకుని స్నానం చేయాలి. ఇప్పుడు భార్యభర్తలు ఒకేసారి పుణ్యస్నానం చేసిన ఫలితం లభిస్తుంది. సూతకం ఉన్నవారు సైతం పుష్కరస్నానం చేయవచ్చు. పుష్కరస్నానం తర్వాత కృష్ణానదీమతల్లిని అష్ణోత్తర శతనామాలతో అర్చించాలి. వీలైతే బ్రాహ్మణుడి చేత పూజాక్రతువు నిర్వహించుకోవచ్చు. మీ శక్త్యానుసారం దానాదికాలు చేయాలి. పితృదేవతలకు పిండప్రదానం చేసినటైతే పుణ్యస్నానం చేయాలి. నదీ తీరాన ఉన్న క్షేత్రదర్శనం చేయాలి. పుష్కరాలకు రాలేకపోయిన బంధుమిత్రుల కోసం నదీజలాన్ని ఇంటికి
తీసుకెళ్లాలి.
ఓం శ్రీకృష్ణాయై నమః
రాబ్దాయై మత్సింహాసనేశ్వర్యై
శ్రీచక్రరాజనిలయార్డయై
శ్రీకరాయై
శ్రీపతివ్రతాయై శ్రీనదీమాతృకాయై
శ్రీమదనంతఫలదాయిన్యై
శ్రీబీజాయై శ్రీకరావరాయై శ్రీజయాయై శ్రీవిరాజితాయై శ్రీమూలాయై శ్రీమత్యై శ్రీమదాపగాయై శ్రీమదాంబికాయై శ్రీగుణాయై శ్రీనద్యై శ్రీమదలకాయై
శ్రీకుచద్వయాయై శ్రీదంతాయై శ్రీకచాయై శ్రీమద్భూమధ్యాయై శ్రీవసుంధరాయై శ్రీతోయాయై శ్రీముఖాయై శ్రీనికేతనాయై శ్రీవిలాసిన్యై శ్రీభ్రూయుగార్డయై
శ్రీమదంబాయై
శ్రీసింహాసనసంస్థితాయై శ్రీజంఘార్డయై
శ్రీభగాయై శ్రీమత్కిలిచక్రవిరాజితాయై శ్రీమధ్యాయై శ్రీమహావాసాయై శ్రీదృశ్యాయై శ్రీమనోరథాయై
శ్రీశ్రీమ్యై శ్రీమహాదీప్తాయై
శ్రీబలాయై శ్రీమహామతాయై
పుష్కర స్నానం ఆచరించేటప్పుడు నదిలో పసుపు కుంకుమలు, పుష్పాలు అర్పిస్తూ ఈ అష్ణోత్తర శతనామావళిని పఠించాలి. ప్రతి నామానికి ముందు "ఓం" అని, చివర “నమః" అని కలిపి చదువుకోవాలి.
శ్రీభూషణాయై శ్రీభూనీలాదిసంస్తుతాయై
శ్రీజటాయై శ్రీఖేచర్యై
శ్రీస్మితాననాయై శ్రీపురాణ్యె
శ్రీమగమదాసంవేద్యాయై శ్రీమద్భూషణభూషితాయై
శ్రీవేదాంతప్రదీప్తికాయై శ్రీమత్పండితసంపూజ్యాయై
శ్రీచంద్రశేఖరజటాజూటాంతరనివాసిన్యై శ్రీదివ్యామృతవాహిన్యై
శ్రీభద్రాసనమథస్థాయై శ్రీమన్మునిసతీబృందసేవితామలపాదుకాయై
శ్రీవీణాగానలోలుపాయై శ్రీమత్సురీబృందసత్కుచాలింగితతరంగిణ్యె
శ్రీమచ్చిత్రాంబరధరామై శ్రీమన్లో హత్యాపాపౌఘహారిణ్యె
శ్రీమత్కంచుకధారిణ్యె శ్రీమహానద్యై
శ్రీమంత్రరాజఫలదాయై శ్రీమాతృసంగపాపఫై్యు
శ్రీమద్దిరివరాత్మజాయై శ్రీహత్యాఘనివారిణ్యె శ్రీమదద్భుతచారిత్రాయై శ్రీశైలోత్తుంగసంయోగసమాగతమహానద్యై
శ్రీవత్సాంకితవక్షస్యై శ్రీనారదాదిమానిభిస్సంపూజితపదాంబుజాయై
శ్రీమత్కాంచనపుష్పాభ నాసికాయై శ్రీశ్రీమత్కృష్ణానదీపుణ్యాహ్వయదివ్యమహానద్యై నమః
శ్రీమనోహరాయై
శ్రీవిగ్రహాయై
శ్రీవిశేషార్డయై
శ్రీభాషాయై
శ్రీధరాత్మజాయై
శ్రీనారాయణపాదాబ్దమందారాయై
శ్రీకరార్చితాయై
శ్రీమార్కండాఘసంహార్యై
కృష్ణానది పుష్కరాల సమయ0ల చేయాల్సిన దానాలు
పుష్కరాల సమయంలో శక్త్యానుసారం ఏ చిన్నదానం చేసినా అది కోటిజన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తుందని శాస్త్రవచనం. అందుకే వాల పాల శక్తిని అనుసరించి కృష్ణానదీ తీరాన పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ఆయా రోజుల్లో పేర్కొన్న దానాలు చేయవచ్చు.
2O16, ఆగస్టు 12 శుక్రవారం బంగారం, ధాన్యం, భూమి, అన్నదానం
2O16-ఆగసు 13 శనివారం రత్నాలు, గోవు. ఉప వస్తాలు Go 2016, ఆగస్టు 14 ఆదివారం బెల్లం, పళ్లు, ఆకుకూరలు, వెండిగుర్రంప్రతిమ
2016, ఆగస్టు 15 సోమవారం నెయ్యి నువ్వులనూనె, పాలు, తేనె, చక్కెర
2016, ఆగస్టు 16 మంగళవారం ధాన్యం, ఎద్దు 2O16, ಅಗಸ್ಟು 17. బుధవారం గంధపుచెక్క ఔషధాలు, కర్పూరం, కసూరి
2016, ఆగస్టు 18 గురువారం పీట, మంచం, వాహనం, గృహం 2016, ఆగస్టు 19 శుక్రవారం గంధం, కందమూలాలు, పూలు 2016, ఆగస్టు 20 శనివారం 16 రకాల దానాలు, పిండప్రదానాలు 2016, ఆగస్ట2 ఆదివారం పూలమాల, ముత్యాలహారం, వెండి 2016, ఆగస్టు 22 సోమవారం పుస్తకాలు, యజ్ఞోపవీతాలు, తాంబూలం
2O16, ఆగస్టు 23 మంగళవారం నువ్వులు, 16 రకాల దానాలు
షోడశదానాలు (16 రకాల దానాలు): 1.ఇల్లు 2. భూమి 3. విసనకర్ర 4. త్రాసు 5. బంగారం 6.వెండి 7. పత్తి 8. తేనె, 9.మంచం 10.రత్నాలు 11.పుస్తకం 12. గోవు 13. ఏనుగు 14. గుర్రం, 15. మేక 16. కన్యాదానం (గోవు, ఏనుగు, అశ్వం వంటివి దానం చేయడం అంటే.. వాటిని ప్రతిమల రూపంలో దానం చేయడమన్నమాట)
కృష్ణానది పుష్కరాల సమయ0ల చేయాల్చిన పిండప్రదానాలు
పుష్కరాల సమయంలో పుణ్యస్నానం ఆచరించి, పితృదేవతలకు పిండప్రదానం చేస్తే ఆ వంశంలో గతించినవారికి సద్గతి కలుగుతుందని, పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పురాణవచనం. అందుకే పుష్కరాల్లో పితృదేవతలకు పిండప్రదానం తప్పక ఆచరించాలి. గతించిన వారి బంధుత్వాన్ని అనుసరించి పిండప్రదానం చేయాలి. బ్రాహ్మణ పురోహితుల ఆధ్వర్యంలో శాస్తోక్తంగా పిండప్రదానం చేస్తే పితృదేవతలందరికీ సద్గతి లభిస్తుంది. కింద పేర్కొన్న బంధుత్వాల్లో ఎవరు మరణించి ఉన్నా వారందరికీ పిండప్రదానం చేయడం శాస్త్రప్రమాణం. అయితే.. తండ్రి మరణించివారు మాత్రమే పుష్కరాల సమయంలో పిండప్రదానం చేసేందుకు అర్చులనే విషయం మర్చిపోకూడదు. కృష్ణానది పుష్కరాల్లో తొమ్మిదో రోజు 2016, ఆగస్టు 20. ఆరోజున వీలుకాకపోతే, గతించిన వారి తిథిని అనుసరించి కానీ లేదా పుష్కర స్నానానికి వెళ్లినరోజున కానీ పిండప్రదానం చేయవచ్చు.
గఠించినవారికి పిండుదానాలు
1. తండ్రి 13. పెద్దనాన్నచిన్నాన్న 2. తల్లి/సవతితల్లి 14. పెద్దమ్మచిన్నమ్మ 3. ముత్తాత(తాత తండ్రి) 15. మేనమామ/మేనత్త 4. జేజమ్ముతాత తల్లి) 16. మేనల్లుడు/మేనకోడలు 5. తాత (తండ్రికి తండ్రి) 17. అల్లుడు/కోడలు 6. తాత (తల్లికి తండ్రి) 18. బావ / మరిది (అక్క/ 7. అమ్మమ్మ చెల్లెలి భర్త) 8. నాయనమ్మ 19. మామ/అత్త 9. భార్య 20. ప్రభువులు/ 10. కొడుకు/కూతురు - యుజమానులు/ దాతలు 11. అన్నతమ్ముడు 21. గురువులు 12. అక్కచెల్లెలు
No comments:
Post a Comment