Tuesday, July 26, 2016

మహా భారతం మనకి ఏమి చెబుతోంది?

మహా భారతం మనకి ఏమి చెబుతోంది?

కర్ణుడు అంటే మంచితనానికి, దాన, ధర్మాలకి పెట్టింది పేరు, అయితే అతను సమయాన్ని బట్టి నడుచుకోక పోవడం వలన కౌరవుల వైపు నిలబడి అనవసరంగా తన ప్రాణాలని పోగొట్టుకున్నాడు. అందుకే   జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని, సమయాన్ని బట్టి నడుచుకోవాలని మనం తెలుసుకోవాలి.  
శకుని అనే వాడు పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి ఘోర పరాజయాన్ని మిగిల్చాడు, శకుని లాంటి వారు మన జీవితంలో చాలా  రకాలుగా సలహాలని ఇస్తుంటారు. వారిని దూరం పెట్టాలి.
పాండవులు శ్రీ కృష్ణుడుని  అలాగే కౌరవులు కర్ణుడుని పొందటం అనేది  వారికి యుద్ధ సమయంలో ఎంతగా ఉపయోగపడిందో అందరికి తెలిసినదే! కర్ణుడి లేని రారాజు బలం ఏ పాటిదో ,కౌరవ సేనకు కర్ణుడు ఏ స్థాయి ధైర్య బలమో తెలిసిన సంగతే కదా, కుల,మత, పేద మరియు ధనిక భేదాలని చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారని తెలియజేస్తూంది .
కౌరవుల తల్లి గాంధారికి నూరు మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది, రాజ్యాన్ని బిడ్డలకి సమంగా పంచటమూ వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచటమూ ఎంతో కష్టమైన పనిష్టం. అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యకాంక్ష కారణంగా కౌరవులంతా  సర్వనాశనం అయ్యారు. కాబట్టి అన్ని చోట్ల ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరం.
అరణ్య వాసం, అజ్ఞాతవాసంలోఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి, వంట పనులు ఎంత గానో ఉపయోగపడ్డాయి, అలాగే మనకి కూడా మన అవసరాల కోసం పనికొచ్చే కొన్ని పనులను  నేర్చుకోవాలి.
కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్న ప్పటికీ పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని నిజాయితీగా చిత్తశుద్దితో పోరాటం చేసి చివరకు విజేతలుగా నిలిచారు.
ద్రుతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ ఇటు తను నమ్ముకున్న సిద్దాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో, కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా వారి తప్పులని ఆపలేకపోయాడు. అదే ద్రుతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంత వరకూ వెళ్ళేది కాదుకదా!  ఎవరి మీద అయిన అతి ప్రేమ, అతి నమ్మకం చూపితే అది చివరికి వినాశనానికి, మోసానికి దారితీస్తాయి.



అర్జునుడు తన జీవితమంతా విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు .ద్రోణా చార్యుల వారి నుండీ యుద్ద శాస్త్రం, ఇంద్రుడు ద్వారా దైవ సంబందమైన ఆయుధాల వాడకం, మహదేవుడి నుండి పాశుపతాస్త్రం, యుధిష్టరుడు  మరియు కృష్ణుడి లాంటి వారి నుండి రాజ నీతులు ఇలా ప్రతి దశలోనూ అభ్యసించడం వల్ల అర్జునుడికి ఓ ప్రత్యెక స్థానం లభించింది. జీవితంలో అనునిత్యం నేర్చుకోవడం వలన మనం ఖచ్చితంగా విజయం సాధించవచ్చు.
కౌరవుల పక్షాన ఎంతో మంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలా మంది పాండవులకి సహాయపడ్డ వాళ్ళే ,బీష్మ ,విదుర ,ద్రోణ రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేసారో తెలిసినదే ,ఇక విదురుడు అయితే కౌరవుల ప్రతీ అడుగు పాండవులకి మోసుకొచ్చిన వాడు కదా.
ద్రౌపది ఐదుగురు భర్తలకూ సంపన్నులూ, అత్యంత బలవంతులు అయినప్పటికి కూడా వారు  సభామందిరాన అవమానం ఆపలేకపోవటంలో విఫలమయ్యారు మరి!దా.
పద్మవ్యూహం లోనికే ప్రవేశించటమే కానీ బయటపడటం తెలియక తనకున్న అర్ధ జ్ఞానమతో అభిమన్య్యుడు వంటి మహావీరుడే నేల రాలిపోయాడు. దీని వాళ్ళ మనకు తెలిసిన దేమంటే .... ఏ పని నయినా  పూర్తిగా తెలుసుకున్నకే మొదలుపెట్టాలి, అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది.
కేవలం ఉత్త పున్యానికి ద్రౌపదికి జరిగిన అవమానం వలన, ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులని వాళ్ళ సామ్రాజ్యాన్ని నామ రూపాలు లేకుండా చేసింది కదా !
చాలా మందికి తెలిసినంత వరకూ అర్జునుడే ప్రపంచం మొత్తంలో అతిపెద్ద విలుకాడు. కుటిల రాజకీయాల వలన తన వేలుని కోల్పోయిన ఏకలవ్యుడు, అర్జునుడిని మించిన వీరుడు నేరుగా గురు శిక్షణ లేకున్నా ,అతనికి ఉన్న ఆసక్తే అర్జునుడి కన్నా గొప్ప వీరుణ్ణి చేసింది. కావున ఏదైనా సాధించాలంటే ముందుగా మనకు దాని పైన అమితమైన ఆసక్తి ఉండాలి లేకపోతే ఏదీ సాధించలేము.
పాండవులకే కనుక కృష్ణుడు తన అతిచక్కని వ్యూహం లేకపోయి ఉంటే పాండవులు విజయాన్ని సాధించ గలిగే వారు కాదు ఏమో, ఏ పని చెయ్యాలన్న ఒక మంచి వ్యూహ మంటూ ఒకటి ఉండాలి. అలా అయితేనే ఆ పనిని సక్రమంగా, సజావుగా పూర్తి చేయగలుగుతాం.

No comments:

Post a Comment