Thursday, July 28, 2016

శ్రీ బాలగణపతి ధ్యానము


కరస్థకదలీచూతపనసేక్షుకమోదకమ్ |
బాలసూర్య మిమం వందే దేవం బాలగణాధిపమ్ ||
దేవాలయాలలో మనం పూజించే విగ్రహాల తీరు భక్తులను ఆకర్షించి వారిహృదయాలలో స్థిరంగా ఉండే విధంగా మలుచబడ్డాయి. కొన్నిచోట్ల స్వయంభువుగా భగవంతుడుఅవతరించాడు. మానవుడు తన జీవితకాలంలో ఎన్నో కష్ట-సుఖాలు అనుభవిస్తుంటాడు తను కష్టంలోవున్నప్పుడు భగవంతుడు రక్షిస్తాడని ప్రగాఢంగావిశ్వసిస్తాడు. పామరులైన వారికి ముక్తిమార్గాన్నిమనప్రాచీన మహర్షులు, ఋషులు శిల్పాగమ గ్రంధాలద్వార మనకందించారు.
మత్స్యపురాణమున పదినెనిమిది మంది శిల్పశాస్త్ర ప్రవర్తల పేర్లు చెప్పారు.1.భృగు 2.అత్రి 3.వసిష్ట 4.విశ్వకర్మ 5.మయ 6.నారద 7.నగ్నజిత్తు 8.విశాలాక్ష 9.పురందర 10.బ్రహ్మ11.కుమార 12.నందీశ 13.శౌనక 14.గర్గ 15.వాసుదేవ 16.అనిరుద్ధ17.శుక్ర 18.బృహస్పతి.
అగ్నిపురాణంలో ఇరవైఐదు, గార్గేయాగమము నందు ఇరవై ఒక్క,మానసారంలో ముప్పైరెండు శిల్పశాస్త్ర ప్రవర్తలు పేర్లు చెప్పారు. వీరుముఖ్యంగా దేవాలయాల ద్వారమానసిక వికాసానికి, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు నాందిపలికారు. దేవాలయ నిర్మాణంలోశిల్పకళను జోడించి ఆలయాన్నిదర్శించిన వారి హృదయాలు ద్రవింపజేసి సన్మార్గం వైపుకు మల్లించిముక్తిపొందు మార్గాన్నిమన పూర్వికులు అందించారు.
గర్భగృహంలో స్థాపించే బింబాలను ధ్రువబేరమని, ధ్రువార్చ అని అంటారు.ధ్రువబేరాన్ని బహుబేరమని - ధ్రువార్చ ఏకబేరమని అంటారు. వీటితోపాటు కౌతుకబేరము,ఉత్సవబేరము, స్నపనబేరము, బలిబేరము లని ఉత్సవాదులకు ఉపయొగించే విగ్రహాలుంటాయి.
విగ్రహాలలో సాత్విక, రాజస, తామస ప్రతిమలుంటాయి. అదేవిధంగాపంచకృత్యములతో అలరిస్తూ భక్తులను ముక్తిమార్గం వైపు మళ్లిస్తున్నాయి. గర్భగృహంలో పదవిన్యాసంఏర్పచడం ద్వార బ్రహ్మపదం, దైవికపదం, మానుషపదం, పైశాచిక పదాలను లెక్కించి విగ్రహాలనుప్రతిష్ఠించడం జరుగుతుంది.
పదవిన్యాసం ద్వార :- ఒకటవ పదంలో గణములు, రెండవపదంలో చాముండేశ్వరి,మూడపదంలోభైరవప్రతిమలు, నాల్గవ పదంలో వినాయకుడు, ఐదవ పదంలో సూర్యుని, ఆరవ పదంలో సరస్వతీదేవి,ఏడవపదంలో సుబ్రహ్మణ్యుడు, ఎనివపదంలో విష్ణుమూర్తిని, తొమ్మిదవ పదంలో బ్రహ్మ, బ్రహ్మసూత్రం-సోమసూత్రం ఖండిత బిందువు నందు నిష్కళ మైన శివలింగాన్ని స్థాపిస్తారు.
1.ప్రతిమలు – బింబభేదములు
(మయమతం)
నిష్కల - సకలం – మిశ్రం
నిష్కలం సకలం మిశ్రం లింగం చేతి త్రిధా మతమ్ ||
నిష్కలం లింగమిత్యుక్తం సకలం బేరముచ్యతే |
ముఖలింగం తయోమిశ్రం లింగార్చకృతిసన్నిభౌ: ||
2. బింబములు మూడు విధములు:
(శిల్పరత్నం)
నిష్కల - సకలం –మిశ్రం
 అచలం - చలం - చలాచలం
చిత్రం - అర్ధచిత్రం – చిత్రాబాసం
శిలలయందు - అచల బింబములు
రత్నము, దారు, లోహం - చలబింబములు
ధాతు వర్ణములతో - పటాదులు చలాచల బింబములు
భగవద్దర్శనము :- సృష్టికి మూలమైన భగవంతున్ని దర్శించే స్థితులు.
అరూపం - రూపం - రూపారూపం లేక అవ్యక్తం – వ్యక్తం - వ్యక్తావ్యక్తం.

శివ రూపదర్శనం
అధారం: కారణాగమము
అతఃపరం ప్రవక్ష్యామి ప్రతిమాలక్షణం శృణు I
త్రివిధం వ్యక్తమవ్యక్తం వ్యక్తావ్యక్తం త ధైవచ II
వ్యక్తంతుసకలాకారం అవ్యక్తం లింగముచ్యతే I
ముఖలింగమితి ప్రోక్తం వ్యక్తావ్యక్తం ప్రజాయతే II
అవ్యక్తం - శివలింగం, వ్యక్తం - చంద్రశేఖరమూర్తి, వ్యక్తావ్యక్తం - ముఖలింగములుఉదాహరణగా చెప్పవచ్చును.        
అవ్యక్తం                  వ్యక్తం                  వ్యక్తావ్యక్తం
వైష్ణవంలో పాంచరాత్రాగమం ప్రకారం ఐదు రూపాల్లో
పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చా వీటిలో అర్చారూపాన్ని శిల్పాచార్యులు శిల్ప శాస్త్రోక్తంగాతయారు చేసినది ఆలయాల్లో ప్రతిష్ఠించి అర్చించునది.
3. ద్రవ్యభేదము - బింబములు – తత్ఫలితములు
శిలామయం మణిమయం లోహం దారుమయం తథా |
మృణ్మయం మిశ్రకం లేఖ్యం బింబం సప్తవిధం స్మృతమ్ ||
4. ప్రతిమా మానలక్షణం:
(మరీచిప్రోక్త - సమరాంగణ సూత్రధారం)
మానాంగులం - మాత్రాంగులం – దేహలబ్దాంగులం
అథ విమానాదిమానవిభాగార్థమంగు లీనాం విధి వక్ష్యే |
మానాంగులం మాత్రాంగులం దేహలబ్ధాంగుల మితిత్రివిధం భవతి |
5. తాలమానం తాల - నియమం:
త్రిమూర్త్యాది  దేవి దేవతలు
ఆసనములు
పద్మాసనం,కుక్కుటాసనం,వీరాసనం,యోగాసనం,ఆలీఢాసనం,ప్రత్యాలీఢాసనం,కూర్మాసనం,సింహాసనం.
6. ప్రతిమల్లోపంచకృత్యాలు:- స్థానక, ఆసన, శయన, స్థానాసన, శయనాసనములు.
1. స్థానకములు :- సమపాదస్థానకము, వైతస్థికస్థానకము, అర్ధవైతస్థికస్థానకము, కాయోత్సర్గము.
2. ఆసనములు :- సుఖ, పద్మ, అర్ధపద్మ, లలిత, వీర, రాజలింగ, ఉత్కుటిక, యోగ, స్వస్తిక, గరుడ.
3. శయనము :- యోగశయనము, సృష్టిశయనము, భోగశయనము, సంహారశయనము.
4. స్థానాసనములు :- వైశాఖ, వైష్ణవము, స్వస్తికము, ఆలీఢము, ప్రత్యాలీఢము, ఏకపాద.
5. శయనాసనము  :- సమశయనము, అర్ధశయనము.
7. శిల్పంలో అంగాలు – అభినయం
దశాంగాలు : తల, ముఖం, కంఠం, వక్షస్థలం, కుక్షి, కటి, మోకాలు, కాలు, పాదము. వీటిలో
మహాంగాలు : ముఖము, చాతి, కటి
అంగాలు : చేతులు, కాళ్లు
ఉపాంగాలు:- శిఖ, నఖ, దంతాలు
ప్రత్యంగాలు : ఆయుధాలు, వస్త్రాలు, ఆభరణలు
ఆంగికాభినయం  : చేతిఅమరికలు, శరీరపుభంగిమలు, ఆసనవిన్యాసం.
ఆహార్యాభినయం : ప్రతిమలకు చెప్పబడిన వస్త్రాలు, ఆభరణాలు, శిరోలంకారములు, ఆయుధములు
సాత్వికాభినయం : కనుబొమలు, కన్ను, పెదవి వీటిద్వార భావాన్ని వ్యక్తీకరించడం
హస్తాభినయం

No comments:

Post a Comment