ఎవరు మార్చ బూనినా మారని-మారలేని వాడు భగవంతుడు. బండ రాయిని మించిన రాయి దేవుడు. దైవ ఉనికికి ఎవ్వరు సమాధానం చెప్పగలరు? ఒకవేళ చెప్పినా గిప్పినా అది ఊహ లేదా బ్రమ అని మాత్రమె అనుకోవాలా? ఫరవా లేదు మీకు తెలిస్తే చెప్పగలరు.
మన ఈ భూ మండలం మీద సమస్త జీవ రాశి మరియు ఈ మానవ రాశి పుట్టినప్పట్నించి భగవంతుడు అనేవాడు నీగ్గాని మరెవరికైనా గాని కనపడలేదు కదా! మరి ఆయనని కనిపించని భగవంతుడు అని అందామా ! ధనవంతుడు అంటే ధనం ఉన్నవాడు అనుకుందాం! భగవంతుడు అంటే మరి భగ ఉన్నవాడనుకుందామా! అసలు భగ అన్న పదం ఉందా ? ఉంటె గింటే దాని కర్ధమేమిటి? తెలిస్తే చెప్పండి. లేదా తెలుసుకొని చెప్పండి...
మనకేనాడూ కనిపించని ఆ భగవంతునికి సంభందించిన ఎన్నో విషయాలు తెలియ జెప్పే వాడు గురువు అనబడతాడు. మన లోపల ఉన్న అంధకారాన్ని అజ్ఞానాన్ని సమూలంగా పోగొట్టేవాడంటారు గురువు.ఆ మాట నిజమే కదా ! మరి దేవునికి సంబందించిన సందేహాలన్నీ అయన తీర్చగలడంటారా? ఆయనకు వేరొకరు తీర్చాలా?
అన్ని దేశాల్లోను, అన్ని కాలాల్లోనూ భగవంతుడి గురించి వెతుకులాట జరుగుతూనే ఉంది. కాలం మారుతుంది. కాలమే దేవుడా? కొత్త గురువులు ఎందరో వస్తారు. వారేదో చెప్తారు. వెర్రి మూకల్లా మనమేదో వింటాము. కొంతమంది భక్తులు కూడా కొత్త దనంతో వెతుకులాట సాగిస్తారు. ఏమి లాభం ?.... ఎన్ని యుగాలు గడిచాయి.... ఎందరు పుట్టి చచ్చారు ?... ఏ ఒక్కడన్నా దేవుడి గురించిన సీక్రెట్ ఒకటి చెప్పాడా? ... ఇదంతా పిచ్చి బ్రమ కాకుంటే అది అయ్యే పనేనా?...ఈ ప్రకృతిలో మారనిది ఏదైనా ఉందంటే - అది కనిపించని భగవంతుడు మాత్రమె - ఎందుకంటే అతను మారలేని స్తితిలో మాయగా ఉన్నాడను కోవచ్చు కదా!