నిజమైన సంతోషం ఎక్కడో ?....
జాతిపిత గాంధీ సత్యాన్ని సంధించేగా విముక్తిని కలిగించాడు. మనసును రాయిని చేసుకొని ఆయనలా సంధించే సత్యాగ్రహం గా మారలేవా? తాను పుట్టిన దేశానికి విముక్తి తెచ్చే అకుంటిత దీక్షతో జనన మరణాల కావల కాపలాగా నిలిచిన ఆమహనీయుని మరువడం మన తరమా చెప్పండి? ఆతని స్మరణే ముక్తి మోక్షమట...
నీ ఈ జననం ఒక దేశానికి, ఒక జాతికి, ఒక సమాజానికి చేటు నుండి ముక్తి ప్రసాదించే ఓ గొప్ప ఆయుధంగా ఎప్పుడు మలచుకుంటావు?
పేద ధనిక తారతమ్యం తొలగిన నాడు ఈ విముక్తితో గాంధీ దేహం పులకించును గదా! ఈ దేశం ఎప్పుడు నిజమైన విముక్తి చెందునో మరి నీవే చెప్పాలి ? దీనికి మరో గాంధీ రావాలా ? నీవే ఆ గాంధీలా మారలేవా?....
నీకేం తక్కువ? గొప్ప శక్తిమంతుడివి నీవు. ఇన్నాళ్ళూ తెలియక గాని నీ దేశ సమస్యలు నీకు తెలియనివా ? పరిష్కార మార్గాలు వెతకడం నీకొక లెక్కకాదు. కానైతే వచ్చిన చిక్కల్లా చిత్తశుద్ది లోపమే.
x
Mee Abhiprayalanu Matho Panchu konandi
ReplyDelete