మీరు మంచి పనులను చేయడానికి ఎప్పుడూ వెనుకాడకండి. వద్దంటే చెడ్డ పనులు మీకు దాపురిస్తుంటాయి. అలాంటి వాటినుండి తెలివిగా తప్పించుకొంటూ నిజాన్నే నమ్ముతూ నమ్మకంగా ఆదర్శంగా జీవించడానికి కంకణం కట్టుకోండి. సదా మంచి పనులని చేసేవాడు సమాజంలో సూర్యుడిలా వెలిగిపోతాడు
పసి హృదయాలు దేవుళ్ళు నివసించే దేవాలయాలు. వాటిల్లో పూజారిలా మెలగుతూ సదా పూజలు నెరపుతూ ఆ పిల్లలనే దేవుళ్ళుగా దర్శించండి. పిల్లలని సహృదయంతో ప్రేమించే వాడు సజ్జనుడవుతాడు.....
అందరిని గౌరవించు. అందులో కొందరిని ఆదరించు. పిన్నలని ప్రేమించు... నీ కన్న వయసులో పెద్దవారిని, వ్యక్తిత్వంలో గొప్పవారిని నిరంతరం గురుభావంతో సేవించు. పెద్దలని వినయంతో గౌరవించేవాడు పునీతు డవుతాడు .......
No comments:
Post a Comment